ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచే ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే జాబ్ క్యాలెండర్ అని ప్రకటించిన ఏపీ సర్కార్… జాబ్ లెస్ క్యాలెండర్ గా మారిపోయిందని టీడీపీ ఎమ్మెల్యేలు మండిపడుతూ.. వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. ఈ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని తిరస్కరించారు. అయితే… ఆ తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం దగ్గరకు చేరుకొని నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం ఎక్కి, ప్లకార్గులు కూడా ప్రదర్శించారు. సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ…. జాబ్ క్యాలెండర్ పై నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసనపై అధికార పక్షం తీవ్రంగా మండిపడింది. చంద్రబాబు అండ్ కో రాజకీయ నిరుద్యోగులుగా మారారని మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. చర్చ చేయకుండా.. స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేయడం ఏంటని మండిపడ్డారు. ఇక… ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి కూడా టీడీపీ సభ్యులపై మండిపడ్డారు. దమ్ముంటే అసెంబ్లీ పెట్టాలని సవాల్ చేసి, ఇప్పుడు సభను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బీఏసీ నిర్వహించక మునుపే ఆందోళన చేయడం ఏంటని మండిపడ్డారు.