డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును మార్పు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజని సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చించారు. వైద్య ఆరోగ్య రంగం కోసం వైఎస్సారో ఎంతో చేశారని చెప్పుకొచ్చారు. ఆరోగ్య శ్రీ పేరుతో పేదలకు ఉచిత వైద్యం అందించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ పట్ల చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదని, ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ పేరు తీసేస్తామని చంద్రబాబే అన్నారని ఆమె పేర్కొన్నారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హతే టీడీపీకి లేదని మంత్రి రజని మండిపడ్డారు.
ఆ తర్వాత మంత్రి ఆర్కే రోజా మాట్లాడారు. హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టినందుకు జగన్ కు ధన్యవాదాలు ప్రకటించారు. పేరు మార్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత సీఎం జగన్ మాట్లాడారు. అనంతరం ఈ బిల్లు సభ ఆమోదం పొందిందని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.