తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్  స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైకోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వానికి ఆయన రిపోర్టు చేశారు. సీనియర్ అధికారి అయిన సోమేశ్‌కు  ఏపీ సర్కారు పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో ఆయన వీఆర్‌ఎస్‌కు  దరఖాస్తు చేసుకోగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదించారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా 2019 నుంచి బాధ్యతలు నిర్వహించిన సోమేశ్ కుమార్, ఏపీ క్యాడర్‌కి   చెందిన అధికారిగా తెలంగాణ హైకోర్టు నిర్ధారిస్తూ ఇటీవలే తీర్పు వెలువరించింది. ఆయనను ఏపీకి బదిలీ చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సోమేష్ కుమార్ జనవరి 12న ఏపీలో రిపోర్టు చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ను కూడా కలిశారు. అయితే  ఇంతా జరిగి దాదాపు నెల రోజులైనా, సోమేశ్ కుమార్‌కు   ఎలాంటి బాధ్యతలూ అప్పగించకపోవటం గమనార్హం. అందువల్లే సోమేష్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారని వార్తలు వస్తన్నాయి.  ఈ నేపథ్యంలో సోమేశ్ కుమార్‌కు  తీసుకున్న నిర్ణయంపై  తెలుగు రాష్ర్టాల్లో  చర్చ జరుగుతున్నది.