టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). తన కర్లీ హెయిర్‌తో, చబ్బీ లుక్స్‌తో టాలీవుడ్‌లో కోట్లాదిమంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకుంది. కార్తికేయ 2తో బ్లాక్ బస్టర్ హిట్టు ఖాతాలో వేసుకున్న ఈ భామ.. ఇటీవలే ఈగల్ సినిమాలో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళ సినిమాలు చేస్తుంది. ఇక త్వరలో టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలావుంటే తాజాగా ఈ భామ.. షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి వెకేషన్‌కు చెక్కేసింది. https://cinemaabazar.com/
తాజాగా మారిషస్ (Mauritius) టూర్‌కు వెళ్లిన వీడియోను అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మారిషస్ అడవుల్లో రోప్ డైవింగ్, సైకిల్ తొక్కడం, కార్ రేస్, బోటింగ్, బీచ్‌లు సెలయేళ్ల వద్ద ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ సాహసాలు చేసింది. అంతేకాకుండా అడవిలో ఉన్న జంతువులను పలకరిస్తూ.. ప్రకృతిని ఆస్వాదించింది. తాజాగా ఈ అడ్వెంచర్‌నంతా వీడియో రూపంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. https://cinemaabazar.com/