బటర్ ఫ్లై సినిమాలో తాను చేసిన పాత్ర చాలా ఎమోషనల్ గా వుంటుంది అని నటి అనుపమా పరమేశ్వర్ వివరించింది. ఈ ఇయర్ సెకండాఫ్ తనకు చాలా బాగుందని ప్రకటించింది. తాను హీరోయిన్ గా నటించిన కార్తికేయ 2, 18 పేజెస్ హిట్టయ్యాయని తెలిపింది. ఇప్పుడు బటర్ ఫ్లై రిలీజ్ అవుతోందని చెప్పింది. గతేడాది డిసెంబర్ లో చిత్రీకరణ ప్రారంభమైందని, నెల రోజుల్లోనే సినిమా పూర్తి చేశామని పేర్కొంది. ఈ సినిమాలో తాను గీత అనే పాత్రలో కనిపిస్తానని, చాలా భావోద్వేగమైన పాత్ర అని వెల్లడించింది.
అయితే.. ఈ పాత్ర చేయడం తనకెంతో సవాల్ గా నిలిచిందని ప్రకటించింది. కుటుంబ సమేతంగా ఈ సినిమాను చూడొచ్చని ప్రకటించింది. ఘంటా సతీశ్ బాబు దర్శకత్వంలో అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం బటర్ ఫ్లై. భూమికా చావ్లా, రావు రమేశ్, నిహాట్, రవి ప్రకాశ్ బోడపాటి, ప్రసాద్ తిరువల్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ నెల 29న డిస్నీప్లస్ హాట్‌స్టార్ ద్వారా విడుదల కాబోతున్నది.