హైదరాబాద్ నగరంలో మరో ప్రపంచస్థాయి బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఇండియన్ బ్యాడ్మింటన్ గురు పుల్లెల గోపీచంద్ నగరంలో మూడో అకాడమీని ప్రారంభించాడు. ఇప్పటికే రెండు అకాడమీలతో ఎంతోమందిని తీర్చిదిద్దిన గోపీచంద్‌తో కలిసి కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ తమ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ గచ్చిబౌలిలో అంతర్జాతీయ ప్రమాణాలతో హై ఫెర్ఫార్మెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఆరు కోర్టులు, పూర్తిస్థాయి స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, సింథటిక్ ట్రాక్, కోచ్ డెవలప్‌మెంట్ కోర్సు సదుపాయం ఉన్నాయి. కార్యక్రమంలో అకాడమీ ట్రస్టీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, కోటక్ మహీంద్రా బ్యాంకు హోల్ టైం డైరెక్టర్ శాంతి ఏకాంబరం, కోటక్ గ్రూప్ ప్రెసిడెంట్ జైమిన్ భట్, సైనా నెహ్వాల్ తదితరులు హాజరయ్యారు.