మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్ తగిలింది. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే మనువడు నిహార్ ఠాక్రే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గంలో చేరాడు. త్వరలో అంధేరి ఈస్ట్ ఉప ఎన్నికల్లో బాబాయ్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నాడు. అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నికల్లో ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో పార్టీ తరఫున ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపాడు.నిహార్ వృత్తిరీత్యా న్యాయవాది. శివసేనపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో ఏక్నాథ్ షిండే వర్గంతో పోరాడుతున్న లీగల్ టీమ్లో నిహార్ ఠాక్రే సైతం ఉన్నాడు. తన తాత, దివంగత బాల్ఠాక్రే వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని, అందుకే షిండేకు మద్దతు ఇచ్చినట్లు నిహార్ పేర్కొన్నాడు. అంధేరీ తూర్పు అసెంబ్లీ స్థానానికి నవంబర్ 3న ఉప ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.