సింగరేణి సోలార్‌కు మరో జాతీయ పురస్కారం దక్కింది. అతితక్కువ సమయంలో పర్యావరణహితంగా 224 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్‌ ప్లాంట్లను నిర్మించి, పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించినందుకు రెనివ్‌ ఎక్స్‌ అవార్డుల్లో ఉత్తమ ఎనర్జీ ట్రాన్సిషన్‌ ఇయర్‌ అవార్డు-2023  లభించింది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులో రెన్యువబుల్‌ ఎనర్జీ సొసైటీ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ మిశ్రా, సింగరేణి డైరెక్టర్‌ సత్యనారాయణకు ఈ అవార్డును అందజేశారు. ప్రస్తుతం 9 ప్లాంట్ల నుంచి 615 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న సింగరేణి,  2024 చివరినాటికి పూర్తిగా సౌర విద్యుత్తుపై నడుస్తున్న సంస్థగా రూపుదిద్దుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది.