బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో రెండేళ్ల పాటు విదేశీ సాయాన్ని నిలిపివేయాలని భావిస్తున్నట్లు మీడియా వెల్లడించింది. బ్రిటన మొత్తం జాతీయ ఆదాయంలో 0.5శాతం మొత్తాన్ని బ్రిటన్ విదేశీసాయం కోసం వినియోగిస్తుంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్ .. రెండేళ్ల క్రితం విదేశీ సాయాన్ని పూర్తిగా నిలిపివేసింది. తాజాగా రిషి సునాక్ నేతృత్వంలోని బ్రిటన్ ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు పొడిగించనున్నట్లు సమాచారం. విదేశీ సాయానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను ప్రధానితోపాటు ఛాన్సలర్ ఉమ్మడిగా తీసుకుంటారని మీడియా పేర్కొంది.
