అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి చేదు అనుభవం

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు గుజరాత్ పర్యటనలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. రాజ్కోట్లో గార్బా ఈవెంట్ను జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అరవింద్ కేజ్రీవాల్తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కూడా హాజరయ్యారు. ఈవెంట్ జరుగుతున్న వేదికపైకి వెళ్తుండగా.. వెనక నుంచి ఓ వ్యక్తి వాటర్ బాటిల్ను కేజ్రీవాల్పైకి విసిరారు.  . అంతకుముందు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేజ్రీవాల్.. ర్యాలీలో కూడా పాలుపంచుకున్నారు. అయినప్పటికీ ఎలాంటి భద్రతాపరమైన సమస్య రాలేదు.  గత నెలలో పర్యటించినప్పుడు కూడా వడోదర విమానాశ్రయంలో బీజేపీ, మోదీకి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కాసింత విసుగు ప్రకటించి వెళ్లిపోయారు. మైదానంలో కేజ్రీవాల్పై నీళ్ల బాటిల్తో దాడి చేయడాన్ని నెటిజెన్లు, ఆప్ కార్యకర్తలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Related Posts

Latest News Updates