విక్టరీ వెంకటేష్ హైలీ యాంటిసిపేటెడ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చుట్టూ ఎక్సయిట్మెంట్ నెక్స్ట్ లెవెల్ చేరుకుంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్‌తో సంచలనం సృష్టించింది, మొదటి రెండు పాటలు సెన్సేషనల్ హిట్‌గా నిలిచాయి.
వెరీ ట్యాలెంటెడ్ భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు సాంగ్ రమణ గోగుల మధు ప్రియ ప్లజెంట్ వోకల్స్, భాస్కరభట్ల ఆకట్టుకునే సాహిత్యంతో మెస్మరైజింగ్ మెలోడీగా నిలిచింది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ మధ్య బ్యూటీఫుల్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేసే పాట ఫ్యాన్స్ లో ఇన్స్టంట్ ఫేవరేట్ హిట్ గా నిలిచింది.
గోదారి గట్టు వెంకటేష్ కెరీర్‌లో ఫాస్టెస్ట్ రికార్డ్ సాధించింది, సీనియర్ హీరోలలో కేవలం3 వారాల్లోనే 50 మిలియన్ వ్యూస్‌ను రీచ్ అయిన ఫాస్టెస్ట్ సాంగ్‌గా నిలిచింది. ఈ ట్రాక్ పాపులారిటీ సోషల్ మీడియా సంచలనంగా మార్చింది, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో, అభిమానులు, ఇన్ఫ్లూయనర్స్ రొమాంటిక్ నంబర్‌పై వారి వోన్ టేక్ ని షేర్ చేస్తున్నారు.
రెండవ పాట మీను కూడా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది, ఇప్పుడు అందరి కళ్ళు వెంకటేష్ స్వయంగా పాడిన మోస్ట్ ఎవైటెడ్ పొంగల్ స్పెషల్ ట్రాక్‌పై ఉన్నాయి. డిసెంబర్ 30న పాట విడుదల కానుంది.
మ్యూజిక్ తో ఇప్పటికే మనసులని గెలుచుకున్న ఈ చిత్రం అభిమానులకు పండుగ ట్రీట్‌గా ఉంటుంది.