మహిళపై చేయి చేసుకున్న కర్నాటక మంత్రి… తీవ్రంగా మండిపడ్డ కాంగ్రెస్

కర్నాటక మంత్రి సోమన్న ఓ కార్యక్రమంలో మహిళపై చేయి చేసుకున్నారు. దీంతో ఆయన తీరుపై అందరూ మండిపడుతున్నారు. చామరాజ్‌నగర్ జిల్లాలోని హంగాలా గ్రామంలో భూమి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి సోమన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా 175 మందికి పట్టాలను పంపిణీ చేశారు. అయితే.. లబ్ధిదారుల ఎంపిక విషయంలో తనకు అన్యాయం జరిగిందని అడగడానికి వచ్చిన కెంపెమ్మ అనే మహిళ పై మంత్రి చేయి చేసుకున్నాడు. నన్నే ప్రశ్నిస్తావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరగలేదని కెంపెమ్మ ఆరోపించింది. అర్హత ఉన్నా తనను ఎంపిక చేయలేదని.. స్థానిక కాంగ్రెస్ నేత నంజప్ప సూచించిన వారికే టైటిల్ డీడ్‌లు ఇచ్చారని ఆమె ఆరోపణలు చేశారు. ఈ విషయంలో మంత్రిని ఆమె నిలదీయడంతో.. మంత్రి చేయి చేసుకున్నారు. ఆ తర్వాత మహిళ మంత్రికి క్షమాపణలు చెప్పింది.

 

 

దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కర్నాటకలో బీజేపీ మంత్రులు, నేతలకు అహంకారం నెత్తికెక్కిందని ఇంతజరిగినా మన ప్రధాని ఎక్కడున్నారు…బొమ్మై ఈ మంత్రిపై వేటు వేస్తారా ..? అంటూ కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సుర్జీవాలా ట్వీట్‌లో నిలదీశారు. కాషాయ నేత ప్రవర్తనను ఎలా సహిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలను జనతాదళ్‌ (ఎస్‌) ప్రతినిధి తన్వీర్‌ అహ్మద్‌ ప్రశ్నించారు. మహిళ పట్ల మంత్రి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

Related Posts

Latest News Updates