ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు… ట్వీట్ చేసిన అమిత్ షా

ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తదనంతరం తెలుగుతల్లి, అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహాల వద్ద నివాళులు అర్పించారు. తర్వాత పోలీసుల నుంచి సీఎం జగన్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్, డీజీపీ తదితరులు హాజరయ్యారు.

 

 

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నేడు అన్ని రంగాలలో అభివృద్ది చెందుతోందని, తెలుగు భాషా కీర్తి నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని గవర్నర్ పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి, పెన్నా తదితర నదులతో పాటూ… సముద్రతీరప్రాంతం ఎక్కువగా ఉండటంతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో రాష్ట్రం దూసుకుపోతుందన్నారు.

 

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రజలకు కేంద్రహోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అమిత్ షా తెలుగులో ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ‘‘అద్భుతమైన సంస్కృతి, గొప్ప మనసున్న ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధి చెందింది. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాను’’అంటూ కేంద్రమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.

Related Posts

Latest News Updates