టీడీపీ నేత నారా లోకేశ్ కి నోటీసులిచ్చిన అనంతపురం పోలీసులు

టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేశ్ కి అనంతపురం పోలీసులు నోటీసులు జారీ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దన్నారు. ఈ మేరకు లోకేశ్ కి 149 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. తాడిపత్రి సమస్యాత్మక నియోజకవర్గం కావడం వల్ల రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేయొద్దని సూచించారు. ఈ నోటీసులను ఇవ్వడానికి తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఈ ఉదయం నారా లోకేష్‌ను కలుసుకున్నారు. నోటీసులు ఇవ్వబోగా- దీన్ని తీసుకోవడానికి నిరాకరించారు. దీన్ని పార్టీ నాయకులు ఇచ్చారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 67వ రోజుకు చేరుకుంది.

 

ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలో అడుగుపెట్టినప్పటి నుంచీ నారా లోకేష్.. స్థానిక వైఎస్ఆర్సీపీ శాసన సభ్యులపై ఘాటు విమర్శలు చేస్తోన్నారు. కదిరిలో డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి, పుట్టపర్తిలో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, శింగనమలలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డిపై పలు ఆరోపణలు సంధించారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిపై భూఆక్రమణ ఆరోపణలు చేశారు. రైతుల భూములను లాక్కున్నారని విమర్శించారు. దీంతో రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపుతోంది.

 

Related Posts

Latest News Updates