దేశానికి సర్దార్ పటేల్ చేసిన కృషి మరువలేనిదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత జాతి ఐక్యతకు కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోయి ఉంటే ప్రస్తుత భారత చిత్రమే ఇలా ఉండేది కాదని అన్నారు. ఆయన చేసిన పనుల వల్ల చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. సర్దార్ పటేల్ గనక దేశానికి మొదటి ప్రధాని అయి వుంటే… దేశం చాలా సమస్యల్లో చిక్కుకునేదే కాదన్న అభిప్రాయం ప్రజల్లో వుందని చెప్పారు.












