ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న నో మనీ ఫర్ టెర్రర్ అంతర్జాతీయ సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఉగ్రవాదం కంటే ఉగ్రవాదానికి సహాయం చేయడం మరింత ప్రమాదకరమని అన్నారు. ఉగ్రవాదాన్ని రక్షించడమంటే దానిని పెంచిపోషించడమేనని స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీ ద్వారా ఉగ్రవాదులు ఆస్తులను పెంచుకుంటున్నారని, టెక్నాలజీని బాగా వాడుకుంటూ, సైబర్, ఆర్థిక నేరాలు చేస్తున్నారని వివరించారు. దీనిపై ప్రపంచమంతా అప్రమత్తంగా వుండాలని పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతిభద్రతలకు ఉగ్రవాదం అత్యంత ముప్పుగా పరిణమించిందన్నారు.

ఉగ్రవాదులు తమ ఆర్థిక మూలాలను బలోపేతం చేసుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారని అన్నారు. ఉగ్రవాదులు తమ సమాచారం గానీ, ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం గానీ బయటకు రాకుండా డార్క్ నెట్ ను ఉపయోగిస్తున్నారని అమిత్ షా తెలిపారు. ఉగ్రవాదానికి నిధులు ఇచ్చి ప్రోత్సహించడం వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలే బలహీనపడుతున్నాయని అన్నారు.












