కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ పరిస్థితి ఎలా వుందో సమీక్షించారు. మునుగోడుపై చాలా యాక్టివ్ గా వుండాలని, మునుగోడు ఉప ఎన్నికను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని నేతలకు స్పష్టం చేశారు. అలాగే టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పటికైనా ఒక్కటవుతాయన్న విషయాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని షా నేతలకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయాలు, రాజకీయ సమీకరణాల గురించి అమిత్ షా తెలంగాణ నేతలతో చర్చించారు.