ప్రవాస గుజరాతీలకు … అమిత్‌ షా పిలుపు

భారతీయ జనతా పార్టీ గుజరాత్ ఎన్నికల్లో విజయపరంపరను కొనసాగిస్తూ వస్తుండటం వెనుక ప్రవాస గుజరాతీల  పాత్ర ఎంతో కీలకమని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. మూడురోజుల  ప్రవాసి గుజరాతి పర్వ్ 2022  ప్రారంభోత్సవానికి హాజరైన వారిని ఉద్దేశించిన అమిత్షా  వర్చువల్ పద్ధతిలో ప్రసంగించారు.  బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని రాష్ట్రంలోని గ్రామగ్రామాలకు చేరవేయాలని ప్రవాస గుజరాతీలను ఆయన కోరారు. గుజరాతీలు ఎక్కడ ఉన్నా ఆ దేశానికి పేరు ప్రతిష్ఠలు తెస్తుంటారని, కేవలం దేశాభివృద్ధికే కాకుండా ప్రపంచాభివృద్ధిలో గణనీయ పాత్రను పోషిస్తున్నారని కొనియాడారు.

1990 నుంచి ఎప్పుడు ఎన్నికలు జరిగినా గుజరాతీ ప్రజలు బీజేపీని గెలిపిస్తూ వస్తున్నారు. ఈ విజయాల్లో ఎన్ఆర్జీలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. మీరు మీ గ్రామాలకు ఇచ్చే సందేశం చాలా కీలకమనే విషయం నాకు తెలుసు  అన్నారు. దేశాభివృద్ధికి కోసం పార్టీ, ప్రధానమంత్రి చేస్తున్న కృషిని గ్రామగ్రామానికి తీసుకువెళ్లే బీజేపీ అంబాసిడర్లు కావాలని ప్రవాస గుజరాతీయలకు ఆయన పిలుపునిచ్చారు.

Related Posts

Latest News Updates