కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన న్యూఢిల్లిలో జమ్మూ కశ్మీర్ విషయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వచ్చే నెల జమ్మూ కశ్మీర్ కేంద్రంగా జీ20 సదస్సు జరగనుంది. జీ 20 సదస్సు సందర్భంగా ఏర్పాట్లు, శాంతిభద్రతలు, వివిధ శాఖల మధ్య సమన్వయం లాంటి విషయాలను చర్చించారు. వీటితో పాటు జమ్మూ కశ్మీర్ లో ప్రస్తుతం నెలకొన్న శాంతిభద్రతలు, తీసుకుంటున్న చర్యలను హోంశాఖ ఉన్నతాధికారులు, జమ్మూ కశ్మీర్ పోలీసు అధికారులు వివరణాత్మకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.అమ
