అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. జనవరి 1,2024 నాటికి అయోధ్య రామ మందిరం సిద్ధమవుతుందని ప్రటకించారు. త్రిపురలో బీజేపీ జన్ విశ్వాస యాత్ర ప్రారంభించిన సందర్భంగా అమిత్ షా ఈ కీలక ప్రకటన చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కోర్టుల్లో దావాలు వేసిందన్నారు. కానీ… సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారని తెలిపారు. ప్రస్తుతం రామ్ లల్లా దర్శనం నూతనంగా నిర్మిస్తున్న ఆలయం పరిసర ప్రాంతంలో జరుగుతోంది. 70 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం జరుగుతున్నది.ఆలయానికి చెందిన 45 శాతం నిర్మాణ పనులు పూర్తి అయినట్లు తెలుస్తోంది. రామ్ లల్లా గర్భగృహ దర్శనం జనవరి 2024 నుంచి ఉంటుందని ఇటీవల రామజన్మభూమి ట్రస్టు కూడా వెల్లడించింది. టెంపుల్ సైట్ వద్ద 550 మంది ఎల్ అండ్ టీ కార్మికులు పనిచేస్తున్నారు.












