‘బింబిసారి’ సూపర్ హిట్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అమిగోస్’. ఈ చిత్రం ద్వారా కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి కల్యాణ్ రామ్ రెడీ అయ్యారు. ఇందులో కల్యాణ్ రామ్ సరసన ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా… యెక యెక యెక… ఎక్కడుందో స్నేహం వెదికాం అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. దీనిని జిబ్రాన్ కంపోజ్ చేసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడాడు. ఫిబ్రవరి 10 న ఈ సినిమాను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.
https://twitter.com/santoshamsuresh/status/1616421118176526339?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1616421118176526339%7Ctwgr%5Ef698a129eea3a0b55b2df394936e9a288974dc19%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fkalyanram-movie-amigos-full-video-song-out-now-1519415













