బిజిసెస్ మెన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కల్యాణ్ రామ్

బింబిసారతో హిట్ తో మంచి ఊపు మీదున్న హీరో కల్యాణ్ రామ్. అదే ఊపులో మరో సినిమాను కూడా చేస్తున్నాడు. అమిగోస్ అనే పేరుతో వస్తున్న చిత్రంలో కల్యాణ్ రామ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అందులో ఏ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడో మాత్రం ఎవ్వరికీ తెలియదు. అయితే.. న్యూ ఇయర్ సందర్భంగా ఈ మ్యాటర్ ను బయటపెట్టేశారు చిత్ర యూనిట్. సిద్ధార్థ్ అనే బిజినెస్ మెన్ గా కల్యాణ్ రామ్ అమిగోస్ లో కనిపించనున్నాడు. దీనికి సంబంధించి టీమ్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కల్యాణ్​ ట్రిపుల్ రోల్‌‌‌‌లో కనిపించనున్నాడట. ఆషిక రంగ‌‌‌‌నాథ్ హీరోయిన్. బ్రహ్మాజీ, సప్తగిరి, జయప్రకాష్, రాజశ్రీ నాయర్, సోనాక్షి వర్మ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌ ఫిబ్రవరి 10న విడుదల కానుంది.

Related Posts

Latest News Updates