మోర్బి ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, కమలా హారిస్

గుజరాత్ మోర్బి జిల్లాలో మచ్చు నదిపై వంతెన కూలిన ఘటనలో (చనిపోయిన వారికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ట్విట్టర్ ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్లిష్ట సమయంలో భారత ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు. “మోర్బి వంతెన కూలిన ఘటనలో తమవారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు జిల్, నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆప్తులను కోల్పోయిన గుజరాత్ ప్రజలతో పాటు మేము సంతాపం ప్రకటిస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో మేము భారతీయ ప్రజలకు అండగా నిలుస్తాము.” అని బైడెన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

అదే విధంగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా స్పందించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. క్లిష్ట పరిస్థితుల్లో భారత్ కు అండగా వుంటామని తెలిపారు.

Related Posts

Latest News Updates