అమెరికా వీసాలపై జోబైడెన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వీసా ఇంటర్వ్యూలో ఓ సారి ఫెయిల్ అయితే… మరోసారి కూడా విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం కల్పించాలని అధ్యక్షుడు జోబైడెన్ నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా వచ్చే నెలలో వీసా ఇంటర్వ్యూ తేదీ స్లాట్లు విడుదల చేయాలని అగ్రరాజ్యం తాజాగా నిర్ణయం తీసుకుంది. మన దగ్గర ఉన్న ముంబై, కోల్కతా, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ కార్యాలయాల్లో ఈ సదుపాయం ఉంటుంది. ఇప్పటికైతే కచ్చితమైన తారీఖులు ఖరారు కానప్పటికీ వచ్చే నెల తొలివారంలో వీసా స్లాట్లు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని యూఎస్ ఎంబసీ కార్యాలయం పేర్కొంది. ఫాల్ సీజన్కు సంబంధించి దేశ రాజధాని ఢిల్లీలోని ఎంబసీ కార్యాలయంతో పాటు ముంబై, కోల్కతా, హైదరాబాద్, చెన్నై కాన్సులేట్ కార్యాలయాల్లో విద్యార్థి వీసా ఎఫ్-1 దరఖాస్తుల ప్రాసెస్ చివరి అంకానికి చేరింది. ఈ వారాంతంలోగా ఈ ప్రక్రియ కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.