చరిత్ర సృష్టించిన అమెరికా… ప్రపంచంలోనే

ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధ విమానం బీ-21 ను అమెరికా ఆవిష్కరించింది. కాలిఫోర్నియా లోని పామ్‌డేల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ రైడర్‌ యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ ప్లీట్‌లో చేరింది. ఇప్పటివరకు ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్‌ యుద్ద విమానాలను అత్యంత అధునాతనమైనవిగా చెప్తారు. అయితే, వీటికన్నా ఈ బీ-21 రైడర్‌ రెండు జనరేషన్ల ముందున్నది. రాఫెల్‌ 4.5 జనరేషన్‌ కాగా, బీ-21 రైడర్‌ 6వ తరం యుద్ధవిమానం. ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ విమానాన్ని గుర్తించి ఢీకొనే రాడార్‌ ఇంతవరకు తయారవ‌లేదు.  డెలాయిట్‌ రైడర్స్‌ను గుర్తు చేసుకునే విధంగా ఈ యుద్ధవిమానానికి బీ-21 అని పేరు పెట్టారు. అమెరికా ఎయిర్‌ ఫోర్స్‌ ప్లీట్‌లో బీ-21 రైడర్‌ చేరడంతో ఈ రకం యుద్ధ విమానం కలిగిన తొలి దేశంగా అమెరికా చరిత్ర సృష్టించింది.  ప్రస్తుతం అమెరికా వైమానిక దళం నార్త్రోప్‌ గ్రుమ్మన్‌ కంపెనీ నుంచి బీ-21 రైడర్‌ విమానాలు ఆరింటిని కొనుగోలు చేసింది. మరో 100 విమానాలను అమెరికా కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇలాంటి విమానాలను అమెరికా కనీసం 200 కొనుగోలు చేయాలని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వద్ద కేవలం 10 శాతం యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా రాడార్‌ను డాడ్జింగ్‌ చేయడం ద్వారా ఎక్కడైనా దాడి చేయగలవు.  అమెరికన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో చేర్చిన వెంటనే దీని స్పెసిఫికేషన్‌ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Related Posts

Latest News Updates