అమెరికా తీపి కబురు

విదేశీ విద్యార్థులకు అమెరికా తీపి కబురు అందించింది. ఇకపై తమ దేశంలో చదువుకోవాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులు కోర్సు ప్రారంభానికి ఏడాది ముందే వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. ఇప్పటివరకు కోర్సు మొదలవడానికి 120 రోజుల ముందు లేదా అంతకంటే తక్కువ సమయం ఉంటేనే వీసా ఇంటర్వ్యూ కోసం షెడ్యూల్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ, ఇకపై కొత్త విద్యార్థులకు 365 రోజుల ముందే స్టూడెంట్ (ఎఫ్, ఎం) వీసాలను జారీ చేయనున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే, దేశంలోకి ప్రవేశం విషయంలో మాత్రం కోర్సు మొదలయ్యే 30 రోజులకంటే ముందు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. అలా ప్రవేశించాలంటే పర్యాటక వీసా ఉండాల్సిందేనని పేర్కొంది.

Related Posts

Latest News Updates