అమెరికా గుడ్ న్యూస్. .. అందుబాటులోకి లక్ష వీసాలు

అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకుని అపాయింట్మెంట్ స్లాట్స్ కోసం వేచి చూస్తున్న వారికి ఓ గుడ్ న్యూస్. తాజాగా లక్ష అపాయింట్మెంట్ స్లాట్స్ను అందుబాటులోకి తెచ్చింది. హెచ్, ఎల్ వీసా దరఖాస్తుదారులకు ఈ అపాయింట్మెంట్ స్లాట్స్ మంజూరు చేసింది. వేల మంది ఇప్పటికే తమ అపాయింట్మెంట్స్ బుక్ చేసుకున్నారు. భారత్లో వెయిటింగ్ పీరియడ్ సగానికి పడిపోయింది. హెచ్, ఎల్  వీసాదారులకు అమెరికా ఇచ్చే ప్రాధాన్యానికి ఇది నిదర్శనం  అని ఇండియాలోని అమెరికా ఎంబసీ పేర్కొంది.  బీ1, బీ2 వీసాల విషయంలో వెయింగ్ పీరియడ్ తగ్గించేందుకు త్వరలో చర్యలు చేపడతామని పేర్కొంది. కాగా.. కొత్త అపాయింట్మెంట్ స్లాట్స్ను అందుబాటులోకి తేబోతున్నట్టు.. అమెరికా కాన్సులార్ అఫైర్స్ మంత్రి డాన్ హెఫ్లిన్ గత నెలలోనే ప్రకటించారు.

Related Posts

Latest News Updates