అమెజాన్ మరో కీలక నిర్ణయం

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న ప్రకటించిన ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నదిఇండియాలో ఎడ్‌టెక్‌ బిజినెస్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను స్కూల్‌ విద్యార్ధుల కోసం ప్రారంభించింది. గత సంవత్సరం అమెజాన్‌ అకాడమీ పేరుతో దీన్ని ప్రారంభించింది. జేఈఈ వంటి పోటీ పరీక్షలకు కూడా కోచింగ్‌ ఇస్తోంది. 2023 ఆగస్టు నుంచి మూసివేత ప్రారంభం అవుతుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ విద్యా సంవత్సరంలో ఎన్‌రోల్‌ చేసుకున్న వారికి పూర్తి ఫీజు రిఫండ్‌ చేస్తామని ప్రకటించింది. విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా అమెజాన్‌ అకాడమీ సెంటర్లను దశలవారిగా మూసివేస్తామని తెలిపింది.సబ్‌స్ర్కైబర్లకు ఇబ్బందులు తలెత్తకుండా 2024 అక్టోబర్‌ వరకు ఫుల్‌కోర్సు మెటీరియల్‌ను అందుబాటులో ఉంచనున్నట్టు అమెజాన్‌ తెలిపింది.  అయితే దీని మూసివేతకు కారణాలు వెల్లడించలేదు.

Related Posts

Latest News Updates