గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన సినిమా 18 పేజీస్. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా సూర్య ప్రతాప్ తెరకెక్కించాడు. ఈ నెల 23 న రిలీజ్ కానుంది. అయితే.. 18 పేజెస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా… ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ హాజరయ్యాడు. డైరెక్టర్ సుకుమార్ కనుక లేకపోతే… తాను ఈ స్థాయిలో వుండేవాడిని కాదని చెప్పుకొచ్చాడు. నటుడిగా తాను ఈ స్థాయిలో వున్నానంటే సుకుమార్ దే క్రెడిట్ అని గర్వంగా చెప్పారు. తన మనసుకు బాగా దగ్గరైన చిత్రం 18 పేజెస్ అని చెప్పాడు. ఈ సినిమా తీసిన తర్వాత… సుకుమార్ తనతో కూడా ఓ సినిమా తీస్తే బాగుండేదని అనిపించిందని వెల్లడించాడు.
హీరో నిఖిల్ ను హ్యాపీడేస్ నుంచి చూస్తున్నానని, మంచి కథలు చేస్తున్నాడని ప్రశంసించాడు. ఈ సినిమా బంపర్ హిట్ కావాలని ఆశిస్తున్నట్లు పేరకొన్నాడు. ఇక… 18 పేజెస్ కథను ఒప్పుకున్నందుకు డైరెక్టర్ సుకుమార్ హీరో నిఖిల్ కి థ్యాంక్స్ ప్రకటించాడు. రాజమౌళి, సుకుమార్ ప్యాన్ ఇండియా చిత్రాలకు దారి వేశారు. ఆ స్ఫూర్తితోనే ‘కార్తికేయ 2’ను తీసుకొచ్చాం. సుకుమార్ రాసిన కథ (18 పేజెస్)లో నేను నటించడం ఆనందంగా ఉంది’’ అని నిఖిల్ అన్నారు. .