అల్లరి నరేష్, సుబ్బు మంగదేవీ, రాజేష్ దండా, బాలాజీ గుత్తా, హాస్య మూవీస్ ‘బచ్చల మల్లి’ డిసెంబర్ 20న విడుదల

అల్లరి నరేష్ యూనిక్ మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ బచ్చల మల్లి. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసినట్లుగా, బచ్చల మల్లి డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల బెనిఫిట్ వుంటుంది కాబట్టి సినిమా థియేటర్లలోకి రావడానికి ఇది పర్ఫెక్ట్ టైం. రిలీజ్ డేట్ పోస్టర్ నరేష్ రగ్గడ్ న్యూ లుక్‌లో అందరిద్రుష్టిని ఆకర్షించింది. చెదిరిన జుట్టు, గుబురు గడ్డంతో, సిగరెట్ తాగుతూ నరేష్ ఇంటెన్స్ అవతార్ అదిరిపోయింది.

ఫస్ట్ లుక్, బర్త్ డే స్పెషల్ గ్లింప్స్, ఫస్ట్ గ్లింప్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక నెలలో సినిమా ప్రేక్షకులు ముందు వస్తుండటంతో మేకర్స్ నెక్స్ట్ ప్రమోషనల్ యాక్టివిటీస్ ని ప్రారంభిస్తారు.

అమృత అయ్యర్ కథానాయికగా కనిపించనున్న ఈ చిత్రానికి సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

మానాడు, రంగం, మట్టి కుస్తి వంటి చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎమ్ నాథన్ డీవోపీగా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.

కథ, మాటలు సుబ్బు స్వయంగా అందించగా, విప్పర్తి మధు స్క్రీన్‌ప్లే, అడిషినల్ స్క్రీన్‌ప్లే విశ్వనేత్ర అందించారు.

తారాగణం: అల్లరి నరేష్, అమృత అయ్యర్, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
కథ, మాటలు, దర్శకత్వం – సుబ్బు మంగదేవి
నిర్మాతలు – రాజేష్ దండా, బాలాజీ గుత్తా
బ్యానర్: హాస్య మూవీస్
స్క్రీన్ ప్లే: విప్పర్తి మధు
అడిషినల్ స్క్రీన్ ప్లే: విశ్వనేత్ర
సంగీతం- విశాల్ చంద్రశేఖర్
డీవోపీ- రిచర్డ్ M నాథన్
ఎడిటింగ్- ఛోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైన్- బ్రహ్మ కడలి.
పీఆర్వో – వంశీ-శేఖర్
మార్కెటింగ్-ఫస్ట్ షో

Related Posts

Latest News Updates