హీరో అల్లరి నరేష్ తన 63 వ చిత్రం కోసం సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ దర్శకుడు సుబ్బు మంగాదేవితో చేతులు కలిపారు. బ్లాక్ బస్టర్ ‘సామజవరగమనా’ చిత్రాన్ని అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం. 4.
ఈ రోజు, మేకర్స్ #N63 టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘బచ్చల మల్లి’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. టైటిల్ పోస్టర్‌లో పూర్తిగా లోడ్ చేయబడిన ట్రాక్టర్ లోయలో పడిపోతున్నట్లు కనిపిస్తోంది. ట్రాక్టర్‌పై టైటిల్ రాసి ఉంది. టైటిల్ పోస్టర్ ద్వారా సినిమాలో యాక్షన్ ఎక్కువగా ఉంటుందని అర్ధమౌతోంది
బచ్చల మల్లి ఈరోజు గ్రాండ్ గా లాంచ్ అయింది. ముహూర్తం షాట్‌కు ప్రతాప్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, అనిల్ రావిపూడి క్లాప్ ఇచ్చారు. విజయ్ కనకమేడల తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్‌ని మారుతీ, బుచ్చిబాబు మేకర్స్‌కి అందజేశారు.
అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో సూచించినట్లుగా, న్యూ -ఏజ్ యాక్షన్ డ్రామాగా యూనిక్ కథతో ఈ చిత్రం రూపొందుతోంది. అల్లరి నరేష్ ఇంటెన్సివ్ రోల్ ప్లే చేయబోతున్నారు. పూర్తిగా కొత్త లుక్ లో కనిపించనున్నారు.
అల్లరి నరేష్ కు జోడిగా అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కోట జయరామ్, రావు రమేష్, సాయి కుమార్, ధనరాజ్, హరితేజ లాంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
భారీ స్థాయిలో రూపొందనున్న ‘బచ్చల మల్లి’లో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ‘సీతారామం’ ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, మానాడు, రంగం, మట్టి కుస్తి చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.
కథ, సంభాషణలు సుబ్బు స్వయంగా అందించగా, విప్పర్తి మధు స్క్రీన్‌ప్లే, అదనపు స్క్రీన్‌ప్లే విశ్వనేత్ర అందించారు.
ఈ చిత్రం 1990 బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది.
తారాగణం: అల్లరి నరేష్, అమృత అయ్యర్, రోహిణి, కోట జయరామ్, రావు రమేష్, సాయి కుమార్, ధనరాజ్, హరి తేజ, ప్రవీణ్, ప్రసాద్ బెహరా, భాను, రోషన్, అంకిత కొయ్య
సాంకేతిక సిబ్బంది:
కథ, మాటలు, దర్శకత్వం – సుబ్బు మంగాదేవి
నిర్మాతలు – రాజేష్ దండా, బాలాజీ గుత్తా
బ్యానర్: హాస్య మూవీస్
స్క్రీన్ ప్లే: విప్పర్తి మధు
అదనపు స్క్రీన్ ప్లే: విశ్వనేత్ర
సంగీతం- విశాల్ చంద్రశేఖర్
డీవోపీ- రిచర్డ్ M నాథన్
ఎడిటింగ్- ఛోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైన్- బ్రహ్మ కడలి
పీఆర్వో – వంశీ-శేఖర్
మార్కెటింగ్-ఫస్ట్ షో