డ్రగ్స్‌ కేసులో క్రిష్‌ జాగర్లమూడి…! 

గచ్చిబౌలి రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో టాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి పేరు కూడా చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. డ్రగ్స్‌ పెడ్లర్‌ అబ్బాస్‌ అలీ స్టేట్‌మెంట్‌లో క్రిష్‌ పేరు ప్రస్తావించినట్లు తాజాగా పోలీసులు పేర్కొన్నారు. డ్రగ్స్‌ కేసులో తన పేరు బయటకు రావడంతో క్రిష్‌ పరారీలో ఉన్నట్లు వార్తలు మొదలయ్యాయి. ఈ క్రమంలో క్రిష్‌ జాగర్లమూడి స్పందించాడు. https://cinemaabazar.com/

తాను రాడిసన్‌ హోటల్‌కు వెల్లింది నిజమేనని క్రిష్‌ జాగర్లమూడి స్పష్టం చేశాడు. కేవలం తన ఫ్రెండ్‌ను కలవడం కోసమే రాడిసన్‌ హోటల్‌కు వెళ్లానని.. సాయంత్రం ఒక అరగంట సేపు మాత్రమే అక్కడ ఉన్నానని తెలిపాడు. సాయంత్రం 6.45 గంటలకు హోటల్‌ నుంచి బయటకు వచ్చేశానని వివరించాడు. ఈ క్రమంలోనే వివేకానందతో కాసేపు మాట్లాడనని అన్నాడు. ఇదే విషయాన్ని పోలీసులకు కూడా తెలియజేశానని చెప్పాడు. దీనిపై పోలీసులు స్టేట్‌మెంట్‌ అడిగారని.. వారికి అన్ని వివరాలు వెల్లడించానని స్పష్టం చేశాడు.

కాగా, రాడిసన్‌ హోటల్‌లో బయటపడ్డ డ్రగ్స్‌ కేసులో ఇప్పటికే 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరికి కొకైన్‌ విక్రయించిన అబ్బాస్‌ అలీపై కూడా కేసు నమోదు చేశారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ అవినాశ్‌ మహంతి వెల్లడించిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని ర్యాడిసన్‌ బ్లూ హోటల్‌లో కొకైన్‌తో డ్రగ్‌ పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు హోటల్‌పై దాడిచేశారు. అప్పటికే ముఠా పరారు కావడంతో పార్టీ నిర్వాహకుడైన మంజీర గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ డైరెక్టర్‌ గజ్జల వివేకానంద ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. https://cinemaabazar.com/

అక్కడాయనకు పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్‌ వాడినట్టు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇచ్చిన సమాచారంతో సయ్యద్‌ అబ్బాస్‌ అలీ జెఫ్రీ, నిర్భయ్‌, కేదార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరో ఆరుగురి కోసం వేట ప్రారంభించారు. నిందితుల నుంచి కొకైన్‌ వాడిన కవర్లు, డ్రగ్స్‌కు ఉపయోగించిన పేపర్లు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివేకానంద బీజేపీ నేత కొడుకు కాగా, కేదార్‌ అలియాస్‌ కేదార్‌నాథ్‌ పలు కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నాడు. సినిమా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నట్టు సమాచారం. వీరిద్దరి సెల్‌ఫోన్లను విశ్లేషిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వారు ముందుగానే ఫోన్లలోని డేటా డిలీట్‌ చేశారని, ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సాయంతో ఆ సమాచారాన్ని రిట్రీవ్‌ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కేసులో మొత్తం పది మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువుర్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. https://cinemaabazar.com/

Related Posts

Latest News Updates