అందుకే సినిమాలు చేయడం మానేశా అంటున్న ప్రభాస్ హీరోయిన్‌!

మీకు అన్షు అంబానీ గుర్తుందా? అదేనండీ నాగార్జున నటించిన మన్మథుడు సినిమా హీరోయిన్‌! ఇప్పుడు గుర్తొచ్చిందా.. ప్రభాస్‌ రాఘవేంద్ర మూవీలోనూ నటించింది. అప్పట్లో ఈ బ్యూటీని చూసి యూత్‌ పిచ్చెక్కిపోయారు. చేసింది రెండు సినిమాలే అయినా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

 మీకు అన్షు అంబానీ గుర్తుందా? అదేనండీ నాగార్జున నటించిన మన్మథుడు సినిమా హీరోయిన్‌! ఇప్పుడు గుర్తొచ్చిందా.. ప్రభాస్‌ రాఘవేంద్ర మూవీలోనూ నటించింది. అప్పట్లో ఈ బ్యూటీని చూసి యూత్‌ పిచ్చెక్కిపోయారు. చేసింది రెండు సినిమాలే అయినా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. కానీ ఆ రెండు సినిమాలతోనే ఆమె సినీ ఇండస్ట్రీకి గుడ్‌ బై చెప్పేసింది. మళ్లీ ఎక్కడా కనిపించకుండా వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ ఇరవై ఏండ్ల తర్వాత ఈమె మీడియా ముందుకొచ్చింది. అప్పుడు అంత సడెన్‌గా ఎందుకు సినిమాలను వదిలేయాల్సి వచ్చిందో కారణాలను వివరించింది.

తాను ఇంగ్లండ్‌లో పుట్టి పెరిగినప్పటికీ.. తన పూర్వీకులు భారతీయులేనని అన్షు అంబానీ చెప్పింది. తనకు 16 ఏండ్లు ఉన్న సమయంలో ఇండియాకు వచ్చానని.. అప్పుడే మన్మథుడు సినిమాలో ఆఫర్‌ వచ్చిందని చెప్పింది. దీంతో తనకు తన కల నిజమైనట్టు అనిపించిందని తెలిపింది. సినిమాల్లో యాక్టివ్‌ అవ్వాలని అనుకున్నా అని.. కానీ చిన్న వయసు కావడంతో చదువుపై కూడా దృష్టి పెట్టాలని అనుకున్నా అని తెలిపింది. కానీ మంచి అవకాశాలు రావడంతో ఎక్కువ రోజులు సినిమాల్లో ఉండాల్సి వచ్చిందని చెప్పింది. ఇప్పుడంటే పీఆర్‌ టీమ్‌లు ఉన్నాయని.. కానీ అప్పుడు అన్నీ వాళ్ల నాన్నే చూసుకునే వారని చెప్పింది. దీంతో ఎక్కడికి వెళ్లాలన్నా తన నాన్న పర్మిషన్‌ తీసుకోవాల్సి వచ్చేదని.. కథలు చెప్పడానికి ఎవరైనా వచ్చినా వాళ్లు ముందుగా నాన్ననే కలవాల్సి వచ్చేది. దీనికితోడు మన్మథుడు సినిమా తర్వాత అన్నీ ఒకే రకమైన పాత్రలు రావడంతో సినిమాలను వదిలేసి వెళ్లానని అన్షు అంబానీ చెప్పింది.

‘ నేను తెలుగులో నటించిన రెండు సినిమాల్లో సెకండ్‌ హీరోయిన్‌గానే ఛాన్స్‌ వచ్చింది. ఆ రెండు సినిమాల్లోనూ నా క్యారెక్టర్‌ చనిపోతుంది. ఈ సినిమాలు చూసి మరో రెండు మూడు చిత్రాల్లో ఇలాంటి రోల్స్‌నే ఆఫర్‌ చేశారు. ‘ అని ఆనాటి పరిస్థితులను అన్షు అంబానీ గుర్తుచేసుకుంది. ఇలా సేమ్‌ క్యారెక్టర్లు రావడంతో విసిగిపోయానని చెప్పింది. ఒకే తరహా పాత్రల్లో నటించడం కంటే ఖాళీగా ఉన్నది బెటర్‌ అనిపించి ఇండస్ట్రీని వదిలేసి వెళ్లానని అసలు విషయం చెప్పింది. ఇప్పటికైనా ఇండస్ట్రీలో టాలెంట్‌ను బట్టి క్యారెక్టర్‌ ఇస్తే బాగుంటుందని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు సూచించింది. ఒక క్యారెక్టర్‌ బాగా చేశారని ఆ నటులను ఆ ఒక్క క్యారెక్టర్‌కే పరిమితం చేయడం కరెక్ట్‌ కాదని తెలిపింది.

Related Posts

Latest News Updates