పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 నుచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి, పీయూశ్ గోయల్ తో పాట కాంగ్రెస్ నేత అధీర్ రంజన్, టీఎంసీ నుంచి డెరెక్ ఓ బ్రెయిన్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, టీఆర్ఎస్ తరపున పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, జేడీఎస్ నుంచి ఎంపీ దౌవెగౌడ హాజరయ్యారు. ఈ సమావేశాల్లో తీసుకొచ్చే కొత్త బిల్లులు, చర్చకు వచ్చే అంశాలపై ఇందులో చర్చించారు. అంతేకాకుండా సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కేంద్రం ఈ సందర్భంగా కోరింది. ప్రభుత్వం తర్వాత ప్రతిపక్షాలు కూడా మాట్లాడాయి. పార్లమెంట్ సమావేశాల్లో తాము లేవనెత్తే అంశాల గురించి కూడా కేంద్రానికి వివరించాయి.

పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ ఇవాళ బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి అన్ని పార్టీల రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు హాజరుకానున్నారు. సాయంత్రం 6 గంటలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో జరిగే బిజినెస్ అడ్వైజరీ మీటింగ్ లో అన్ని పార్టీల ప్రతినిధులు పాల్గొననున్నారు.

Related Posts

Latest News Updates