“ఆలా ఇలా ఎలా” నుంచి సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటను విడుదల చేసిన దర్శకుడు పి వాసు

కళ మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మాతగా ప్రముఖ దర్శకుడు పి వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరో గా రాజ్ శంకర్, పూర్ణ, నాగ బాబు, బ్రహ్మానందం, అలీ, సీత, సితార, నిషా కొఠారి ప్రధాన పాత్రలో రాఘవ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ఆలా ఇలా ఎలా”. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన పాటలను ఇటీవలే హిందూపూర్ లో అంగరంగవైభవంగా విడుదల చేశారు. ఇప్పుడు ఈ చిత్రంలో మొదటి లిరికల్ పాటను దర్శకుడు పి వాసు విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ “కళ మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మాతగా నిర్మించిన చిత్రం “ఆలా ఇలా ఎలా”. సినిమా చూసాను చాలా వచ్చింది. నేను విడుదల చేసిన పాట కూడా చాలా బాగుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ పాట కి లిరిక్స్ అందించారు. సినిమా మంచి హిట్ అవుతుంది. ఈ చిత్రం లో మా అబ్బాయి శక్తి హీరో గా నటించాడు, చాలా బాగా నటించాడు. ఈ చిత్రాన్ని జులై 21న భారత దేశం అంతటా ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా విడుదల అవుతుంది. అందరు చూడండి సినిమా ని సూపర్ హిట్ చేయండి” అని కోరుకున్నారు.

చిత్రం పేరు : ఆలా ఇలా ఎలా

నటి నటులు : శక్తి వాసుదేవన్, రాజా శేఖర్, పూర్ణ, షియాజీ షిండే, నాగబాబు, రియాజ్ ఖాన్, బ్రహ్మానందం, అలీ, నిషా కొఠారి, హరిప్రియ, సితార, రేఖ, సీత, తదితరులు

యాక్షన్ డైరెక్టర్ : రాజశేఖర్

డాన్స్ మాస్టర్ : శోభి, అశోక్ రాజ్, నిక్సన్, గిరి, దిన

ఎడిటర్ : జాషి ఖ్మెర్

కెమెరా మాన్ : పి కె హెహ్ దాస్

సంగీతం : మణిశర్మ

నిర్మాత : కొల్లకుంట నాగరాజు

దర్శకుడు : రాఘవ

Related Posts

Latest News Updates