వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న వెర్సటైల్ యాక్టర్ అశోక్ సెల్వన్ హీరోగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ వయాకామ్ 18, రైజ్ ఈస్ట్ బ్యానర్స్ సంయుక్తంగా ఆర్.ఎ.కార్తీక్ దర్శకత్వంలో రూపొందిస్తోన్న చిత్రం ‘ఆకాశం’. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. వారికి సంబంధించిన క్యారెక్టర్స్ పేర్లు, వాటి లుక్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. వ్యవసాయం చేసే రైతు కుమార్తె మతి పాత్రలో ‘అపర్ణ బాల మురళి’.. కాలేజ్ స్టూడెంట్ మీనాక్షి పాత్రలో ’శివాత్మిక’.. ట్రావెలింగ్‌ను ఇష్టపడే అమ్మాయి ‘శుభ’ పాత్రలో రీతూ వర్మ నటిస్తోంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.