కేరళలో అగ్నిపథ్ స్కీం రిక్రూట్ మెంట్ ర్యాలీ ప్రారంభం.. భారీ సంఖ్యలో హాజరైన యువత

కేరళలో నేడు అగ్నిపథ్ స్కీం రిక్రూట్ మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. కొల్లాంలోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం వేదికగా ఈ ర్యాలీ నడుస్తోంది. దీనిని జిల్లా కలెకర్టర్, ఎస్పీ, ఆర్మీ రిక్రూట్ మెంట్ అధికారులు ప్రారంభించారు. దాదాపు 7 జిల్లాల నుంచి యువత పెద్ద సంఖ్యలో తరలిచ్చారు. తిరువనంతపురం, కొల్లాం, పటనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాల నుంచి యువకులు తరలివచ్చారు. అయితే.. ముందుగా ఆన్ లైన్లో అప్లై చేసుకున్న వారినే ఈ ర్యాలీకి ఆర్మీ అనుమతిచ్చింది. మొత్తం 25 వేల 367 మంది ఆన్ లైన్లో రిజిస్టర్ చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఫిజికల్ ఫిట్ నెస్ కోసం నేరుగా 2 వేల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీనిని పూర్తి చేసుకున్న వారు మెడికల్ ఫిట్ నెస్ కోసం హాజరవుతారు.

Related Posts

Latest News Updates