కోవిడ్ నేపథ్యంలో ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశం

విదేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఓ సారి అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని కూడా సూచించింది. ఇక… తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా రంగంలోకి దిగారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు. విదేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటం, వాటి ప్రభావం భారత్ లో ఎంత వుంటుంది? అన్న దానిపై లోతుగా చర్చించనున్నారు.

చైనాలో కరోనా మళ్లీ విశ్వరూపం చూపుతోంది. బీఎఫ్7 రకానికి చెందిన ఒమిక్రాన్ వైరస్ భారత్ లోనూ వెలుగు చూసింది. దేశంలో ఈ రకానికి చెందిన కేసులు 4 నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం అప్రమత్తమైంది. ప్రస్తుతం కరోనా కేసులు అదుపులోనే వున్నాయని, భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తతే శ్రీరామ రక్షే అని కేంద్రం పేర్కొంది.

Related Posts

Latest News Updates