తిరుప్పావై – 8వ పాశురము
బ్రహ్మశ్రీ కంభంపాటి నాగఫణిశర్మ గారి తెలుగు అనువాదముతో
కీళ్ వానమ్ వెళ్ళెన్రు ఎరుమై శిరు వీడు
మేయ్వాన్ పరన్దనకాణ్! మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్
పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తున్నై
కూవువాన్ వన్దు నిన్రోమ్ కోదుకలముడైయ
పావాయ్ ! ఎళు న్దిరాయ్, పాడిప్పరై కొణ్డు
మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ
దేవాదిదేవనై చ్చెన్రు నామ్ శేవిత్తాల్
ఆవా వెన్రారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్.
తాత్పర్యము
తూర్పుదిక్కు తెల్లవారుచున్నది. చిన్న బీడులోనికి మేయుటకు విడువబడిన గేదెలు విచ్చలవిడిగా పోవుచున్నవి. మిగిలిన పిల్ల లందరును గూడ వ్రతస్థలమునకు పోవుటకై బయలుదేఱి, అట్లు పోవుటయే తమకు ప్రయోజన మనునట్లు పోవుచున్నారు. ఆ పోవువారిని ఆపి మేము నిన్ను పిలుచుటకు నీ వాకిట వచ్చి నిలిచినాము. కుతూహలము కలదానా ! ఓ పడతీ ! లేచి రమ్ము ! కృష్ణగుణములను కీర్తించి వ్రతమున కుపక్రమించి వ్రతసాధనమగు పరను పొంది, కేశి యను రాక్షసుని చీల్చి చంపినవానిని, మల్లురను మట్టుపెట్టినవానిని, దేవతలకు ఆదిదేవుడైనవానిని మనము పోయి సేవించినచో అయ్యో ! అయ్యో ! మీరే వచ్చితిరే ! యని బాధపడి మన మంచి చెడ్డలను విచారించి మనలను కటాక్షించును.!!
మీ
నందగోపాలమోహనవంశీకృష్ణశర్మ బిదురు