తిరుప్పావై – 7వ పాశురము
బ్రహ్మశ్రీ కంభంపాటి నాగఫణిశర్మ గారి తెలుగు అనువాదముతో
కీశు కీశెన్రెఙ్గుమానై చ్చాత్తఙ్గలన్దు !
పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే !
కాశుమ్ పిరప్పుమ్ కలగలప్పక్కై పేర్తు
వాశ నరుఙ్గుళ లాయిచ్చియర్; మత్తినాల్
ఓశైప్పడుత్త త్తయిర రవమ్ కేట్టిలైయో
నాయకప్పెణ్పిళ్లాయ్ ! నారాయణన్ మూర్తి
కేశవనై ప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో
తేశ ముడైయాయ్ ! తిర వేలో రెమ్బావాయ్.
తాత్పర్యము….
భరద్వాజపక్షులు పగలువిడిపోదుము కదా యని తెల్లవారుజామున కలసికొని అన్నివైపులా ఏవేవో మాటలాడుకొనుచున్నవి. ఆమాటలలోని ధ్వనినైననూ నీవు వినలేదా!
ఓ పిచ్చిదానా! కుసుమాలంకృతమగు కేశబంధములు వీడుటచే సుగంధములను వెదజల్లుచున్న జుట్టుముడులు గల గోపికలు, కవ్వములతో పెరుగు చిలుకునపుడు, వారిచేతుల కంకణధ్వనులు, మెడలోని ఆభరణ ధ్వనులతో కలసి, విజృంభించి, ఆకాశము నంటుచున్నవి. ఆ ధ్వనిని వినలేదా! ఓ నాయకురాలా! సర్వపదార్థములలో వాత్సల్యముతో వ్యాపించియుండి, మనకు కన్పడవలెననిమూర్తిమంతుడై కృష్ణుడుగా అవతరించి, విరోధులను నశింపజేసిన ప్రభువును కీర్తించుచుండగా వినియును, నీవు పరుండియుంటివా! నీ తేజస్సు మాకు కన్పట్టుచున్నది. దాని నడ్డగింపక మేము దర్శించి యనుభవించునట్లుతలుపు తెరవవలయును.!!
మీ
నందగోపాలమోహనవంశీకృష్ణశర్మ బిదురు