తిరుప్పావై : అందమైన సింహాసనమును ఆదిష్టించి మా విన్నపములను వినుము

తిరుప్పావై –23వ పాశురము
బ్రహ్మశ్రీ కంభంపాటి నాగఫణిశర్మ గారి తెలుగు అనువాదముతో
మారిమలై ముళఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గుమ్
శీరియ శిఙ్గమరివిత్తుత్తీ విళిత్తు
వేరిమయిర్ పొఙ్గ వెప్పాడుమ్ పేర్ న్దుదరి
మూరి నిమిర్ న్దు ముళఙ్గిప్పురప్పట్టు
పోదరుమాపోలే, నీ పూవైప్పూవణ్ణా ! ఉన్
కోయిల్ నిన్రిఙ్గనే పోన్దరుళి కోప్పుడైయ
శీరియ శిఙ్గాసనత్తిరున్దు యామ్ వన్ద
కారియమారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్
తాత్పర్యము…
పర్వతగుహలో వర్షాకాలమున కదలక మెదలక పరుండి నిద్రించుచున్న శౌర్యము గల సింహముమేల్కొని, తీక్ష్ణమగు చూపుల నిటు నటు చూచి, ఒకవిధమగు వాసన గల తన ఒంటివెండ్రుకలు నిగుడునట్లు చేసి, అన్నివైపులదొర్లి , దులుపుకొని, వెనుకకు ముందుకు శరీరమునుచాపి, గర్జించి, గుహనుణ్డి వెల్వడి వచ్చునట్లు, ఓ ఆతసీపుష్పసవర్ణా! నీవు నీ భవనము నుండి ఇట్లే బయటకి వేంచేసి రమణీయసన్నివేశముగల లోకోత్తరమగు సింహాసనమును అధిష్ఠించి మేము వచ్చిన కార్యమును ఎరుంగ ప్రార్థించుచున్నాము.!!
మీ
నందగోపాలమోహనవంశీకృష్ణశర్మ బిదురు

Related Posts

Latest News Updates