తిరుప్పావై –30వ పాశురము
బ్రహ్మశ్రీ కంభంపాటి నాగఫణిశర్మ గారి తెలుగు అనువాదంతో
వఙ్గ క్కడల్ కడైన్ద మాదవనై క్కేశవనై
త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళ యార్ శెన్ఱిరైఞ్జి
అఙ్గప్పరై కొణ్డవాతైయణిపుదువై
పైఙ్గమల త్తణ్ తెరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న
శఙ్గత్తమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామే
ఇఙ్గప్పరిశురై ప్పారిరణ్డు మాల్వరైత్తోళ్
శె ఙ్గణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాల్
ఎఙ్గమ్ తిరువరుళ్ పెత్తిన్బురువ రెమ్బావాయ్
తాత్పర్యము…
ఓడలతో నిండియున్న క్షీరసముద్రమును మథింపచేసి, లక్ష్మీదేవినిపొంది మాధవుడైనవానిని, బ్రహ్మరుద్రులకు కూడ నిర్వాహకుడైనవానిని, ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగువారును, విలక్షణాభరణములను దాల్చినవారును అగు గోపికలు చేరి, మంగళము పాడి, పఱ యను వాద్యము లోకులకొరకును, భవద్దాస్యమును తమకొరకును పొందిరి. ఆప్రకారము నంతను, లోకమునకు ఆభరణమైయున్న శ్రీవిల్లిపుత్తూరులో అవతరించి, సర్వదా తామరపూసలమాలను మెడలో ధరించియుండు శ్రీ భట్టనాథుల పుత్రిక యగు గోదాదేవి ద్రావిడభాషలో ముప్పది పాశురములలో మాలికగా కూర్చినది.
ఎవరీ ముప్పది పాశురములను క్రమము తప్పక చదువుదురో, వారు ఆనాడు గోపికలా శ్రీకృష్ణునినుండి పొందినఫలమును, గోదాదేవి వ్రతము నాచరించి పొందిన ఫలముగూడ పొందుదురు. కేవలము అధ్యయనము చేయుటచేతనే, పుండరీకాక్షుడను, పర్వతశిఖరముల వంటి బాహుశిరస్సులు గలవాడును, శ్రీ వల్లభుడును, చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాదించును.!!
మీ
నందగోపాలమోహనవంశీకృష్ణ శర్మ బిదురు