తిరుప్పావై – 11వ పాశురము
బ్రహ్మశ్రీ కంభంపాటి నాగఫణిశర్మ గారి తెలుగు అనువాదముతో
కత్తు క్కఱవై క్కణంగళ్ పల కఱన్దు
శెతార్ తిఱ లళియ చ్చెన్రు శెరుచ్చెయ్యుమ్
కుత్త మొన్రిల్లాద కోవలర్దమ్ పొర్కొడియే
పుత్తర వల్గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు తోళిమారెల్లారుమ్ వన్దు నిన్
ముత్తమ్ పుగున్దు ముగిల్ వణ్ణన్ పేర్పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్ణాట్టి ! నీ
ఎత్తు క్కురంగుమ్ పొరుళే లోరెమ్బావాయ్.
తాత్పర్యము…
లేగదూడలు గలవియు, దూడల వలె నున్నవియు, నగు ఆవుల మందల నెన్నింటినో పాలు పితుకగలవారును, శత్రువులను ఎదిరించి బలముతో యుద్ధము చేయగలవారును, ఏవిధమగు దోషము లేనివారును అగు గోపాలకుల వంశమున మొలచిన ఓ బంగారుతీగా ! పుట్టలోని పాము పడగవలె నన్ను నితంబప్రదేశము గలదానా ! అడవిలోని నెమలివలె అందమైన కేశపాశముతో ఒప్పుచున్నదానా ! రమ్ము. చుట్టములును, చెలికత్తెలను మొదలుగ అందరును వచ్చిరి. నీముంగిట చేరిరి. నీలమేఘవర్ణుడగు శ్రీకృష్ణుని నామము కీర్తించుచుండిరి. కీర్తించుచున్నను నీవు ఉలుకక పలుకక ఉన్నావేమి? ఓ సంపన్నురాలా ! నీ నిద్రకు అర్థమేమో తెలుపుము.!!
మీ
నందగోపాలమోహనవంశీకృష్ణశర్మ బిదురు