తిరుప్పావై : లోకమర్యాద తెలియని పిల్లలము. నిన్ను గోవిందా! అని పేరు పెట్టి పిలిచినందులకు అలుక వహించక మాకు పఱనిమ్ము

తిరుప్పావై –28వ పాశురము

బ్రహ్మశ్రీ కంభంపాటి నాగఫణిశర్మ గారి తెలుగు అనువాదంతో

క ఱవైగళ్ పిన్ శెన్రు కానమ్ శేర్ న్దుణ్బోమ్,

అఱివొన్రు మిల్లాద వాయ్ క్కులత్తు ఉన్దన్నై

ప్పిఱవి పె ఱున్దనై పుణ్ణియమ్ నాముడైయోమ్

కు ఱైవొన్రు మిల్లాద గోవిన్దా !ఉన్దన్నోడు

ఉఱవేల్ నమక్కి ఙ్గొళిక్క వొళియాదు

అఱియాద పిల్లెగళోమ్, అన్బినాల్ ఉన్దన్నై

చ్చిఱుపేరళైత్తనవుమ్ శీఱి యరుళాదే

ఇఱైవా నీ తారాయ్ పఱైయేలో రెమ్బావాయ్.

తాత్పర్యము…

పశువులవెంట వానిని మేపుటకై అడవికి పోయి, అచటనే శుచి నియమములు లేక తిని, జీవించియుండుటయే ప్రయోజనముగా తిని, తిరిగెడివారము. ఏమియు జ్ఞానము లేని మా గోపవంశమును మాతో సజాతీయుడవై నీవు జన్మించిన పుణ్యమే మాకున్న పుణ్యము. మాకెన్ని లోపము ఉన్నను తీర్చగల్గినట్లు ఏ లోపము లేనివాడవు కదా నీవు . గోవిందా! ఓ స్వామీ! నీతో మాకు గల సంబంధము పోగొట్టుకొన వీలుకాదు. లోకమర్యాద నెరుంగని పిల్లలము. అందుచే ప్రేమవలన నిన్ను చిన్నపేరుపెట్టి పిలిచినాము . దానికి కోపము తెచ్చుకొని మమ్ములననుగ్రహింపక యుండకుము. మాకు అపేక్షితమగు పఱను ఒసంగుము.

Related Posts

Latest News Updates