తిరుప్పావై – 5వ పాశురము
బ్రహ్మశ్రీ కంభంపాటి నాగఫణిశర్మ తెలుగు అనువాదముతో
మాయనై మన్ను, వడమదురై మైన్దనై
త్తూయ పెరునీర్ యమునై త్తురైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్రుమ్ మణి విళక్కై
త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వన్దు నామ్ తూమలర్ తూవిత్తొళుదు
వాయినాల్ పాడి, మనత్తినాల్ శిన్దిక్క
పోయపిళ్ళైయుమ్ ప్పుగుదరువా నిన్రనవుమ్
తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్
తాత్పర్యము:-
ఆశ్చర్యకరములగు చేష్టలు కలవాడును, నిత్యము భగవత్సంబంధము గల ఉత్తరదేశమునందలి మథురానగరానికి నిర్వాహకుడును, పవిత్రము, అగాధమునగు జలముగల యమునానదిరేవే తనకు గురుతుగా కలవాడును, గోపవంశమున ప్రకాశించిన మంగళదీపము అయినవాడును, తల్లి యశోద గర్భమును ప్రకాశింప చేయునటులు త్రాడుచే కట్టబడి దామోదరు డైనవాడును నగు కృష్ణభగవానునివద్దకు మనము పవిత్రులై వచ్చి, పరిశుద్ధములగు పుష్పములతో నర్చించి, అంజలిఘ్హటించి, వాక్కుతో కీరించి, మనసార ధ్యానించినచో మన పూర్వసంచిత పాపరాశియు, ఆగామిపాపరాశియు అగ్నిలో పడిన దూదివలె భస్మమైపోవును. కావున భగవానుని నామములను పాడుడు.!!
మీ
నందగోపాలమోహనవంశీకృష్ణశర్మ బిదురు