యు.వి.క్రియేష‌న్స్‌ చేతికి రెబల్ స్టార్ ప్ర‌భాస్‌ ‘ఆది పురుష్’

ఏ హీరో చేయ‌ని విధంగా డార్లింగ్ ప్ర‌భాస్ వ‌రుస పాన్ ఇండియా ప్రాజెక్టుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు.  ఆయ‌న చేస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ‘ఆది పురుష్’ ఒక‌టి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌగ్ తెర‌కెక్కిస్తున్నారు. రామాయ‌ణం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో మ‌న ప్ర‌భాస్ రాముడిగా  క‌నిపించ‌బోతున్నారు. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌగ్ తెర‌కెక్కిస్తున్నారు. రామాయ‌ణం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో మ‌న ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌బోతున్నారు. కృతి స‌న‌న్. సీతగా మెప్పించ‌నుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీఖాన్  ఇందులో రావ‌ణాసురుడిగా అల‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ ఇప్ప‌టికే అనౌన్స్‌మెంట్ ఇచ్చేయ‌టంతో సినిమాపై ఉన్న అంచ‌నాలు పెరుగుతున్నాయి. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన హ‌క్కుల‌ను ప్ర‌భాస్‌కు ద‌గ్గ‌రైన యు.వి.క్రియేష‌న్స్  సంస్థ వంద కోట్ల రూపాయ‌ల‌కు ద‌క్కించుకుంద‌ని స‌మాచారం. సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే ఇక క‌లెక్ష‌న్స్ ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ‘ఆది పురుష్’ .. లాస్ ఏంజిల్స్  లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. త్రీడీ వి.ఎఫ్‌.ఎక్స్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ‘ఆది పురుష్’ సినిమాను విడుద‌ల చేసేలా నిర్మాత‌లు భారీ ఎత్తున స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ప్ర‌భాస్‌కున్న క్రేజ్ దృష్ట్యా ‘ఆది పురుష్’ సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కుల‌కు భారీ క్రేజ్ ఏర్ప‌డింది. సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ఈ సినిమా ఓవ‌ర్ సీస్ హ‌క్కుల‌ను రూ. 38 కోట్ల అడ్వాన్స్ మొత్తాన్ని అడుగుతున్నారు. అయితే ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న ప‌రిస్థితులు.. ప్ర‌భాస్ గ‌త చిత్రాలు సాహో , రాధే శ్యామ్  చిత్రాలు ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాక‌పోవ‌టంతో పాటు ఇప్ప‌టి వ‌ర‌కు ఆది పురుష్ సినిమాకు సంబంధించి చిన్న ఫ‌స్ట్ లుక్‌, ప్రోమో కూడా బ‌య‌ట‌కు రాక‌పోవ‌టంతో సినిమా ఎలా ఉంటుందో తెలియ‌క డిస్ట్రిబ్యూటర్స్ ఓవ‌ర్ సీస్ హ‌క్కుల‌ను కొనుగోలు చేయ‌డానికి ఆలోచిస్తున్నార‌ని కూడా టాక్‌.

Related Posts

Latest News Updates