ఆదిపురుష్ ఎవరి కోసం ?

ఆదిపురుష్ టీజర్ చూడగానే ఈ వ్యాసం రాయాలనిపించింది. చిన్నప్పటి నుండి బాపు దర్శకత్వంలో వచ్చిన సంపూర్ణ రామాయణం, రాముడిగా హరనాథ్, రావణుడిగా ఎన్ టి ఆర్ నటించిన సీతారామ కళ్యాణం వంటి సినిమాల్లో రాముడిని ఎంత అందంగా తీర్చిదిద్దారు. అలకలల్లలాడ అన్న కీర్తనలో వర్ణించినట్లుగానేవారి కేశసౌందర్యం, రూపురేఖలు అల్లరిస్తాయి. రాముడు సకలగుణాభిరా ముడు, క్షత్రియుడైనా సుందర సుకుమారమైన లాలిత్యం ఆయన సొంతం. వాల్మీకి రామాయణంలో గురువు విశ్వామిత్రునితో యాగ సంరక్షణార్ధం అడవికి వెళతారు. పొద్దున్న లేచాక వాళ్ళు నడిచి వెళ్ళేటప్పుడు గురువుగారు వెనకాల నడిచి వస్తున్న రాముడి అందాన్ని తిరిగి చూస్తూ విశ్వామిత్రుడు ఆనందపడదడా న్ని వాల్మీకి అద్భుతంగా రాస్తాడు. నీల మేఘశ్యాముడు రాముడు చూసేకొద్ధి చూడాలనిపించే అందం ఆయన సొంతం. అలాంటి రాముడికి గడ్డాలు, మీసాలు, సైడ్ బటక్స్ ఏమిటి?
వి ఎఫ్ ఎక్స్ వాడితే వాడండి. కానీ హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా తీస్తే ఎలా? దర్శకుడు ఓం రౌత్ హిందీలో రాసిన రామాయణాలని పరిశీలించాకే ఆది పురుష్ తీసారా? అన్న సందేహం కలుగుతుంది.
ఇక రావణుడి పాత్ర విషయానికి వస్తే రావణబ్రహ్మ సద్ బ్రాహ్మణుడు. శ్రీలంక వాసి. అటువంటి రావణ పాత్రలో ఎన్ టి రామారావు, ఎస్ వి రంగారావు ఎంత అందంగా, అద్భుతం నటించారో మనకు తెలుసు. కమలాకర కామేశ్వరరావు వంటి ఉద్ధండ దర్శకులు పౌరాణిక పాత్రలను అద్భుతంగా తీర్చి దిద్దారు. పౌరాణిక పత్రాలకు పెట్టింది పేరు తెలుగు చిత్ర పరిశ్రమ.
రామానంద్ సాగర్ రామాయణాన్ని సీరియల్ గా తీసి జన బాహుళ్యానికి దగ్గరచెయ్యడంలో కృతకృత్యులయ్యారు. ఇక రావణబ్రహ్మ విషయానికి వస్తే అంతటి శివభక్తుడు, నిష్టా గరిష్టుడైన రావణ పాత్రకు సైఫ్ అలీఖాన్ ను ఎంపిక చేసుకోవడమే దర్శకుడు చేసిన తప్పు. ఇక టీజర్ లో చూపించిన రావణ పాత్ర భారత దేశంమీద దండయాత్ర చేసిన మొఘల్ చంఘిజ్ ఖాన్ కు నకలు. కళ్ళకు సుర్మా పెట్టుకుని, బవిరి గడ్డంతో భీతి కొల్పే రీతిలో రావణ పాత్ర పది తలలతో వికృతం గా ఉన్నాడు. అసలు ఈ దర్శకులు హిందూ పురాణాలను సినిమాలుగా ఎందుకు తీస్తున్నారో? ఇతర మతాలకు చెందిన కథలను, నమ్మకాలను అవహేళన చేస్తూనో లేక దర్శకులకు నచ్చినట్లుగా తీసే ధైర్యం ఉందా? హిందూ పురాణాలను సినిమాలుగా తీస్తే మూలంలో ఉన్నదాన్ని యధా తధంగా తియ్యాలి! లేదంటే మానెయ్యాలి. మొత్తం మీద ఆది పురుష్ టీజర్ తెలుగు చిత్ర పరిశ్రమనే కాదు, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరిని బాధించిందనే చెప్పాలి. మొత్తం మీద ఆది పురుష్ టీజర్ ఇన్ని ప్రకంపనలు సృష్టిస్తే, సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
డాక్టర్ కనకదుర్గ వడ్లమాని
సీనియర్ జర్నలిస్ట్

Related Posts

Latest News Updates