‘ఆదిపురుష్’మూవీ టీజర్‌పై నెటిజన్ల ట్రోలింగ్ దాడి ఆగడం లేదు. ప్రభాస్‌ను ఇలా చూపించావేంటి అంటూ డైరెక్టర్ ఓం రౌత్ పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ మూవీ టీజర్ సినీ లవర్స్‌తో పాటు అభిమానులను కూడా తీవ్ర నిరాశకు గురిచేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ టీజర్‌పై నెట్టింట భారీ ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ టీజర్ సినీ లవర్స్‌తో పాటు అభిమానులను కూడా తీవ్ర నిరాశకు గురిచేసింది. టీజర్ అస్సలు బాగోలేదని.. వీఎఫ్ఎక్స్ షాట్స్ క్వాలిటీగా లేవంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సినిమా ఇలానే రిలీజ్ చేస్తే.. కచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అవుతుందని ముందే జోస్యం చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ మూవీ టీజర్‌పై విపరీతంగా చర్చ జరుగుతోంది. ప్రభాస్‌ను ఇలా చూపించావేంటి అంటూ డైరెక్టర్ ఓం రౌత్ పై విమర్శలు వస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా మరో వివాదం తెరపైకి తెచ్చారు. టీజర్‌లోని కొన్ని సన్నివేశాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై డైరెక్టర్ ఓం రౌత్‌కు లేఖ రాస్తానని తెలిపారు. ఈ సినిమాలోని అభ్యంతరకర సీన్స్ తొలగించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదిపురుష్ మూవీ టీజర్ చూశానని.. కొన్ని సన్నివేశాల వలన హిందువుల మతపరమైన మనోభావాలు దెబ్బ తీసేవిధంగా ఉన్నాయన్నారు.
फिल्म #Adipurush में हिंदू धर्म की आस्था पर कुठाराघात और धार्मिक भावना को आहत करने वाले कई आपत्तिजनक दृश्य हैं।
इस पर फिल्म के निर्माता-निर्देशक ओम राउत जी को पत्र लिख रहा हूं। इसके बाद भी आपत्तिजनक दृश्य नहीं हटाए जाते हैं, तो कानूनी पक्ष पर विचार किया जाएगा। pic.twitter.com/NlohyAXYhi
— Dr Narottam Mishra (@drnarottammisra) October 4, 2022
ఈ అభ్యంతరకర సన్నివేశాలను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ‘టీజర్‌లో హిందూ దేవుళ్ల దుస్తులు, రూపురేఖలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. హనుమంతుడు తోలు ధరించినట్లు చూపించారు. ఆంజనేయుడి వేషధారణ మన గ్రంథాలలో భిన్నంగా ఉంటుంది..అదే విధంగా రావణాసురుడి వేషధారణ కూడా ఆ గడ్డం అది మరో మతానికి సంబందించిన వుంది. ఇవి మతపరమైన మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలు. అలాంటి సన్నివేశాలన్నింటినీ సినిమా నుంచి తొలగించాలని ఓం రౌత్‌కి లేఖ రాస్తున్నాను. తొలగించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..’ అంటూ నరోత్తమ్ మిశ్రా హెచ్చరించారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, సీతగా కృతి సనన్ నటించారు. సైఫ్ ఆలీ ఖాన్ రావణుడి పాత్రను పోషించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం కన్నడతో సహా పలు భాషల్లో విడుదల కానుంది. వచ్చే ఏడాది జనవరి 12న ఆడియన్స్ ముందుకు రానుంది.