ఆది సాయికుమార్‌ ‘క్రేజీ ఫెలో’ ప్రీరిలీజ్ ఈవెంట్

మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్‌. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మించిన   యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ క్రేజీ ఫెలో.  దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న సినిమా విడుదలౌతున్న నేపధ్యం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హీరో శర్వానంద్ ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో శర్వానంద్ మాట్లాడుతూ.. ఆది నాకు బ్రదర్ లాంటి వాడు. తనని తమ్ముడిలానే చూస్తాను. తనకి సక్సెస్ వస్తే నేను ఎంజాయ్ చేస్తాను. క్రేజీ ఫెలోలో రన్ రాజా రన్ ఫ్లేవర్ కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే మంచి ఎంటర్ టైనర్ అనిపిస్తోంది.  క్రేజీ ఫెలో పెద్ద సక్సెస్ కావాలి. రాధ మోహన్ గారు నాకు పదేళ్ళుగా పరిచయం. పాటలు చాలా బావున్నాయి. దర్శకుడు ఫణి కృష్ణ టేకింగ్ బావుంది. మాటల్లో మంచి కామెడీ టైమింగ్ వుంది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ బెస్ట్ విశేష్. అక్టోబర్ 14న సినిమా వస్తోంది. అందరూ థియేటర్ సినిమా చూసి ఎంజాయ్ చేయండి” అన్నారు. ఆది సాయికుమార్  మాట్లాడుతూ..  ఈ ఈవెంట్ కి వచ్చిన శర్వానంద్ అన్నకి కృతజ్ఞతలు. మారుతి, సంపత్ నంది గారికి థాంక్స్. క్రేజీ ఫెలో హిలేరియస్ ఎంటర్ టైనర్. మంచి ఎమోషన్ కూడా వుంటుంది. కథని బలంగా నమ్మి చేశాం. దర్శకుడు ఫణి కృష్ణ చాలా అద్భుతమైన కథని రెడీ చేశారు. నిర్మాత రాధామోహన్ గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మించారు. ద్రువన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సతీష్ ముత్యాల గారు వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమాలో చేసిన మిర్నా, అనీష్, రమేష్, సప్తగిరి .  అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. అక్టోబర్ 14న సినిమా థియేటర్ లోకి వస్తుంది. ప్రేక్షకులు థియేటర్ లో చూసి ఆదరించాలి” అని కోరారు.  సంపత్ నంది మాట్లాడుతూ.. రాధమోహన్ గారి శ్రీ సత్య సాయి ఆర్ట్స్ నా హోం బ్యానర్ లాంటింది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ తొలి సినిమా చేస్తున్న దర్శకులకు లక్కీ బ్యానర్.  ఏమైయింది ఈవేళ తో నాకు మంచి విజయం ఇచ్చారు. ఈ సినిమాతో ఫణి కృష్ణ కూడా మంచి విజయం దక్కుతుంది. రాధకృష్ణ గారు ప్యాషన్ తో సినిమా చేసే నిర్మాత. క్రేజీ ఫెలో లో మంచి మ్యూజిక్ వుంది. టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా చేశారు. అక్టోబర్ 14న అందరూ సినిమా ఆదరిస్తారని కోరుతున్నాను. నిర్మాత రాధమోహన్ మాట్లాడుతూ.. మేము కోరగానే ఈ వేడుకుకు వచ్చిన శర్వానంద్, సంపత్ నంది, మారుతి గారికి కృతజ్ఞతలు. దర్శకుడు ఫణి కృష్ణ చెప్పిన కథ నచ్చింది. ఈ కథకి ఆది చక్కగా సరిపోయాడు. మిర్నా ఈ సినిమాతో తెలుగులో అడుగుపెడుతోంది. ఈ సినిమా కోసం మంచి టీమ్ వర్క్ చేశాం. ద్రువన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. దర్శకుడు ఫణి కృష్ణ కి మంచి భవిష్యత్ వుంది. తను ఏం చెప్పాడో అదే తీశారు. క్రేజీ ఫెలో మంచి ఎంటర్ టైనర్. అక్టోబర్ 14న సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి”  అని కోరారు. చిత్ర దర్శకుడు ఫణి కృష్ణ మాట్లాడుతూ..నేను చెప్పిన కథ నచ్చి, నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత రాధామోహన్ గారికి కృతజ్ఞతలు. అక్టోబర్ 14న ఆయన నమ్మకం నిలబెట్టుకుంటాను. అది గారు ఈ సినిమాలో కొత్తగా వుంటారు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించింది. ఈ సినిమా కోసం చాలా క్రేజీగా పని చేశాం. ఈ సినిమాకి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. మిర్నా మీనన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. సినిమా షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాను. అది గారితో పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. అక్టోబర్ 14న థియేటర్లో సినిమా చూసి మమ్మల్ని ప్రోత్సహించండి” అని కోరారు దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. క్రేజీ ఫెలో పాటలు చాలా ఎనర్జిటిక్ గా వున్నాయి. అది చాలా అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేశారు. నిర్మాత రాధ మోహన్ గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాని తీశారు. సినిమాలో కూడా కొత్త కాన్సెప్ట్ ఉంటుందని భావిస్తున్నాను. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి” అని కోరారు  ద్రువన్ మాట్లాడుతూ.. క్రేజీ ఫెలో క్రేజీ మెమొరీలా వుండిపోతుంది. నిర్మాత రాధామోహన్ గారికి, దర్శకుడు ఫణి కృష్ణ కి కృతజ్ఞతలు. ఆది గారి కెరీల్ ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ విజయం అవుతుంది” అన్నారు ఈ వేడుకలో కాసర్ల శ్యామ్, యాక్షన్ కోరియోగ్రఫర్ రామకృష్ణ,  అనీష్ కురివిల్లా,  వినోదిని వైద్యనాధన్ తదితరులు  పాల్గొన్నారు.

Related Posts

Latest News Updates