భారత్ లో వ్యాక్సినేషన్ అద్భుతంగా జరిగింది… భయం లేదు.. జాగ్రత్తలు చాలు… : అధర్ పూనావాలా

చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు మళ్లీ వెలుగు చూస్తున్నాయి. దీంతో కేంద్రం కూడా అప్రమత్తమై… ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ప్రజలు రద్దీ ప్రాంతంలో కచ్చితంగా మాస్క్ ధరించాలని సూచించింది. అయితే.. దీనిపై వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా స్పందించారు. ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ప్రకటించారు. అయితే… కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను మాత్రం తప్పకుండా పాటించాలన్నారు. భారత్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ భారీ స్థాయిలో చేపట్టారని, కేసుల కట్టడికి సంబంధించిన ట్రాక్ రికార్డు గొప్పగా వుందన్నారు. కరోనా కేసులు చైనాలో పెరుగుతున్నాయన్నది ఆందోళనకరమేనని అన్నారు. అయితే… వ్యాక్సినేషన్ మన దేశంలో భారీగానే జరిగిందని, భయపడాల్సిన అవసరం లేదని పూనావాలా ట్వీట్ చేశారు.

 

Related Posts

Latest News Updates